కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణ ప్రజలు బాగుపడుతరు : షర్మిల

కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణ ప్రజలు బాగుపడుతరు  : షర్మిల

కాంగ్రెస్ తో కలిసి ఎలా పనిచేయాలనే దానిపై సోనియా గాంధీతో చర్చించామని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు.  హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్సాఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల..  పార్టీ విలీనంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. 

తాను నిలబడి కార్యకర్తలనూ నిలబెడుతానని చెప్పారు.  పార్టీ కార్యకర్తలంతా బాగుండాలన్నదే తన ప్రయత్నమని చెప్పిన షర్మిల..  సోనియా గాంధీతో జరిపిన చర్చలను తానూ ఇప్పుడే బయటపెట్టడం సరికాదన్నారు.   కాంగ్రెస్ తో చర్చలు తుదిదశకు చేరుకున్నాయని , కార్యకర్తలతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు షర్మిల.   

వైఎస్సాఆర్ పై కాంగ్రెస్ కు అపారమైన గౌరవం ఉందన్నారు.  కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణ ప్రజలు బాగుపడుతారని చెప్పారు.