గో హత్యలను ఆపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం

గో హత్యలను ఆపకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం

బక్రీద్ సందర్బంగా గ్రేటర్‌లో జరుగుతున్న గో హత్యాకాండను ఆపాలంటూ యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ అన్నారు. గో హత్యాకాండను నియంత్రించడంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. సేవా సంస్థ చైర్మన్ విజయ్ రామ్ మాట్లాడుతూ.. గో హత్యలు, గో తరలింపులు ఆపకపోతే... నిరాహారదీక్ష చేసి ప్రాణాలు వదలడానికైనా సిద్ధమని హెచ్చరించారు.

గో హత్యలను ఆపాలంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు. ‘గో హత్యలు, గో హింస, కళేబరాలను మూసివేయాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని మేం పోరాడుతున్నాం. తల్లి లాంటి గోమాతను  పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం గో హత్యలను ప్రోత్సహిస్తోంది. నిత్యం గోవులు నరకం అనుభవిస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. గ్రేటర్‌కి నిత్యం లారీల్లో వేల గోవులు వస్తున్నాయని డీజీపీకి ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదు. గో హత్యలను డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. గో హత్యలకు పాల్పడే వారిని శిక్షించకుండా వారికి అనుకూలంగా పనిచేస్తూ చట్టాలను ధిక్కరిస్తున్నారు. అంతేకాకుండా ఓవైసీకి మద్దతు ఇస్తున్నారు. గో చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బక్రీద్ సందర్బంగా హైదరాబాద్ చుట్టూ చెక్ పోస్ట్లులు ఏర్పాటుచేసి గో హత్యలను ఆపాలి. పోలీసులు మరియు పాలకులు గో హత్యల మీద దృష్టి పెట్టకుండా.. ముస్లిం సోదరులకు మద్దతు ఇస్తున్నారు. గోవులను ఇష్టారాజ్యంగా తరలిస్తే చూస్తూ కూర్చోం. గోవులను చంపే వారిని టెర్రరిస్టుల్లా గుర్తించాలి. గో హత్యలను ప్రోత్సహిస్తున్న ఓవైసీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. గోవులను తరలించడం ఆపకపోతే... జూలై 21న గ్రేటర్‌లో గో బంద్ కార్యక్రమాన్ని తలపెడతాం. ప్రతి ఒక్కరు గోవు కోసం బయటికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పోలీసులు ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే.. భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది. ఈ విషయంలో డీజీపీ స్పందించకపోతే హైదరాబాద్‌ని దిగ్భంధనం చేస్తాం’ అని శివకుమార్ అన్నారు.