హన్సీ: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానాలోని హన్సీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం ఇంటెరిమ్ బెయిల్‌పై విడుదల చేశారు. గతేడాది జూన్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో యువరాజ్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఓ క్రికెటర్ గురించి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు యువీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనిపై యువీ అప్పుడే క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ, హన్సీకి చెందిన ఓ అడ్వకేట్ యువీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం విచారణకు హాజరైన యువీని పోలీసులు అదుపులోకి తీసుకుని వెంటనే బెయిల్‌పై రిలీజ్ చేశారు.

