బట్లర్ రికార్డ్.. కోల్ కతాపై రాజస్థాన్ విక్టరీ

బట్లర్ రికార్డ్.. కోల్ కతాపై రాజస్థాన్ విక్టరీ

ముంబై: ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తూ..  ఈ సీజన్‌‌‌‌లోనే అత్యంత ఉత్కంఠగా సాగిన పోరులో కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌పై రాజస్తాన్‌‌ రాయల్స్‌‌దే పైచేయి అయింది. జోస్‌‌ బట్లర్(61 బాల్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103) సెంచరీకి తోడు యుజ్వేంద్ర చహల్ (5/40)సీజన్​లో తొలి హ్యాట్రిక్‌‌ సహా ఐదు వికెట్లతో మ్యాజిక్‌‌ చేయడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ 7 రన్స్‌‌ తేడాతో గెలిచింది. లీగ్‌‌లో నాలుగో విక్టరీతో రెండో ప్లేస్‌‌కు చేరుకుంది.  శ్రేయస్ అయ్యర్ (51 బాల్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 85), ఆరోన్‌‌ ఫించ్ (28 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 58) ఫిఫ్టీలతో విజృంభించినా.. చివర్లో తడబడ్డ కోల్‌‌కతా వరుసగా మూడో మ్యాచ్‌‌లో ఓడింది  బ్యాటర్లు దుమ్మురేపిన పిచ్‌‌పై తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 217/5 భారీ స్కోరు సాధించింది. నరైన్ (2/21) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్‌‌లో  కోల్ కతా 19.4 ఓవర్లలో 210 రన్స్ కు ఆలౌటై ఓడింది. శ్రేయస్‌‌, ఫించ్‌‌ మెరుపులతో సులువుగా గెలిచేలా కనిపించిన కేకేఆర్‌‌ను దెబ్బకొట్టిన చహల్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

బట్లర్ సూపర్​ హిట్‌‌ 

లీగ్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తూ బట్లర్ మరోసారి రెచ్చిపోవడంతో ఫస్ట్ బ్యాటింగ్ లో రాజస్తాన్ భారీ స్కోర్ సాధించింది. మూడో ఓవర్లో 4,6తో బౌండ్రీల ఖాతా తెరిచిన బట్లర్ ఆపై వెనుదిరిగి చూసుకోలేదు. పడిక్కల్ (24) సపోర్ట్ తో ఈ ఇంగ్లిష్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పవర్ ప్లేలోనే రాయల్స్ 60 రన్స్ చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై పడిక్కల్ కూడా బౌండ్రీల బాట పట్టడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఈ దశలో 10వ ఓవర్లో పడిక్కల్ ను ఔట్ చేసిన నరైన్ మొదటి వికెట్ కు 97 రన్స్ పార్ట్ నర్ షిప్ ను బ్రేక్ చేశాడు. అనంతరం సంజూ శాంసన్ (19 బాల్స్ లో 38) కూడా స్పీడ్ గా ఆడటంతో 15 ఓవర్లలోనే స్కోర్ 163/1కి చేరింది. ఆ తర్వాతి ఓవర్లో శాంసన్ ను రసెల్ పెవిలియన్ పంపాడు. అయితే ఎక్కడా తగ్గని బట్లర్ కమిన్స్ వేసిన 17వ ఓవర్లో సిక్స్ తో సీజన్​లో రెండో సెంచరీ నమోదు చేశాడు. కానీ అదే ఓవర్లో అతడు వెనుదిరగడంతో కేకేఆర్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాతి రెండు ఓవర్లలో రియాన్ పరాగ్ (5), కరుణ్ నాయర్ (3) వికెట్లతో పాటు 10 రన్సే ఇచ్చిన కోల్ కతా బౌలర్లు స్కోరుకు కాస్త కళ్లెం వేశారు. చివరి ఓవర్లో హెట్ మయర్ (26 నాటౌట్) 6,6,4 కొట్టడంతో రాయల్స్ స్కోర్ 200 దాటింది.

శ్రేయస్, ఫించ్‌‌ ధనాధన్‌‌.. 

కొండంత లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతాకు మొదటి బాల్ కే షాక్ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన నరైన్ (0)ను హెట్​మయర్ రనౌట్ చేశాడు. అయితే, వచ్చీ రాగానే రెండు ఫోర్లతో టచ్ లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ తో పాటు మరో ఓపెనర్ ఫించ్ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపాడు.  వీరిద్దరూ దాటిగా ఆడటంతో పవర్ ప్లేలో కోల్ కతా 57/1తో నిలిచింది. ఇక ఇదే జోరు కొనసాగించిన ఫించ్.. ప్రసిధ్ 8వ ఓవర్లో రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమ్ స్కోరును వంద దాటించాడు. కానీ అదే ఓవర్లో అతడు ఔట్ కావడంతో రెండో వికెట్ కు 107 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. నితీశ్ రాణా(18) కాసేపు మెరిశాడు. కానీ వరుస ఓవర్లలో రాణా, రసెల్ (0)ను ఔట్ చేసిన రాయల్స్ రేసులోకి వచ్చింది. అప్పటికి 14 ఓవర్లలోనే కేకేఆర్ స్కోర్ 150 దాటడంతో రెండు జట్లకు విజయావకాశాలు కనిపించాయి. ఇక ఒబెద్ వేసిన 15వ ఓవర్లో శాంసన్ క్యాచ్ డ్రాప్ తో బతికిపోయిన శ్రేయస్ ఆ ఓవర్లో 6,4తో పాటు బౌల్ట్​ ఓవర్లోనూ సిక్స్ తో టార్గెట్​ను కరిగించాడు. ఈ సమయంలో బౌలింగ్ కు వచ్చిన చహల్ 17వ ఓవర్లో హ్యాట్రిక్​తో పాటు మొత్తం నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ ను రాజస్తాన్ వైపు తిప్పాడు. ఈ ఓవర్లో తను వెంకటేశ్ (5), శ్రేయస్, శివం మావి (0), కమిన్స్ (0)లను ఔట్ చేశాడు. చివరి18 బాల్స్ లో 38 రన్స్ కావాల్సిన స్థితిలో బౌల్ట్ బౌలింగ్ లో ఉమేశ్ (21) 6,6,4తో కేకేఆర్ క్యాంప్ లో ఆశలు రేపాడు. 19వ ఓవర్లో ప్రసిధ్​ 7 రన్సే ఇవ్వగా..  చివరి ఓవర్లో కోల్ కతాకు 11 రన్స్ అవసరమయ్యాయి. కానీ, ఈ ఓవర్లో జాక్సన్ (8), ఉమేశ్​ వికెట్లు తీసి కేకేఆర్​ను ఆలౌట్ చేసిన​ ఒబెద్.. రాజస్తాన్ ను గెలిపించాడు.

సంక్షిప్త స్కోర్లు

రాజస్తాన్: 20 ఓవర్లలో 217/5 (బట్లర్ 103, నరైన్ 2/21).
కోల్ కతా : 19.4 ఓవర్లలో 210 ఆలౌట్ (శ్రేయస్ 85, ఫించ్ 58, చహల్ 5/40, ఒబెద్ 2/41).