V6 News

హైదరాబాద్లో జెన్ డైమండ్ కొత్త స్టోర్

హైదరాబాద్లో జెన్ డైమండ్ కొత్త స్టోర్

హైదరాబాద్​, వెలుగు: జెన్ డైమండ్ సంస్థ హైదరాబాద్ లేక్‌షోర్ మాల్‌లో తన కొత్త స్టోర్‌‌ను ప్రారంభించింది. ముంబై, బెంగళూరు, చండీగఢ్  తర్వాత దక్షిణ భారతదేశంలో తన ఉనికిని చాటుకోవడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌‌లో సహజ వజ్రాలతో కూడిన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. 

అంతర్జాతీయ నటి జెన్నిఫర్ లోపెజ్ ఈ బ్రాండ్‌కు అంబాసిడర్. అక్షయ తృతీయ సందర్భంగా రూ.90 వేల కొనుగోలుపై  బంగారు నాణేన్ని ఉచితంగా ఇస్తున్నారు. పాత బంగారాన్ని మార్చుకుంటే, మార్కెట్ ధర కంటే గ్రాముకు రూ.2,400 అదనంగా ఇస్తామని ఈ స్టోర్​ ప్రకటించింది.