జెన్‌‌‌‌వర్క్‌‌‌‌కు రూ.1,200 కోట్లు

జెన్‌‌‌‌వర్క్‌‌‌‌కు రూ.1,200 కోట్లు

హైదరాబాద్, వెలుగు:  డిజిటల్ టాక్స్ ఫైలింగ్‌‌‌‌ ప్రొవైడర్,  ఫిన్‌‌‌‌టెక్ సాస్ (సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్) ప్లాట్ ఫామ్ జెన్ వర్క్ తాజాగా స్పెక్ట్రమ్ ఈక్విటీ నుంచి రూ.1,200 కోట్లు సేకరించింది. అమెరికాలోని బోస్టన్‌‌‌‌ కేంద్రంగా పనిచేసే స్పెక్ట్రమ్ ఈక్విటీ గ్రోత్ ఈక్విటీ ఫర్మ్. ఈ ఫండింగ్​ను తమ సొంత బ్రాండ్లు .. టాక్స్ 1099, కాంప్లియెన్సీలను డెవెలప్‌‌‌‌ చేసేందుకు, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ ను మెరుగుపర్చేందుకు వాడుతామని జెన్‌‌‌‌వర్క్‌‌‌‌ ప్రకటించింది.  రెగ్యులేటరీ, పవర్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఆటోమేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్‌‌‌‌కు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చేందుకూ ఈ డబ్బును వాడతారు. జెన్ వర్క్ తన క్లయింట్లకు ఎక్కడి నుంచైనా ట్యాక్స్‌‌‌‌ఫైలింగ్‌‌‌‌, కేవైసీ, కేవైబీ, జీఎస్టీ ఫైలింగ్‌‌‌‌ వంటి సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ సంజీవ్‌‌‌‌ సింగ్‌‌‌‌ మాట్లాడుతూ ఆటోమేషన్‌‌‌‌ టెక్నాలజీ ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా అకౌంటెంట్స్, సీపీఏలు, బుక్ కీపర్స్, కార్పొరేషన్లకు ట్యాక్స్‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌, రిపోర్టింగ్‌‌‌‌ సేవలను అందిస్తామని చెప్పారు.  కంపెనీలు తక్కువ మంది ఎంప్లాయీస్‌‌‌‌తోనే ట్యాక్స్‌‌‌‌ పనులను పూర్తి చేయవచ్చని చెప్పారు. జెన్ వర్క్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షకు పైగా సంస్థలకు తన సేవలను అందిస్తోంది. వీటిలో 30 వేల సీపీఏ కంపెనీలు ఉన్నాయి.   ఏటా 40 వేల మంది కొత్త క్లయింట్లను చేర్చుకుంటోంది. లక్షలాది ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్ ను ప్రాసెస్ చేస్తోంది.  ఏటా 1.2 కోట్లకుపైగా బిజినెస్ ఐడెంటిటీ, కాంప్లియెన్స్ తనిఖీలను నిర్వహిస్తోంది. అమెరికా వంటి కంపెనీల్లో ట్యాక్స్‌‌‌‌ సేవల కోసం ‘టాక్స్ 1099’, ‘కాంప్లియెన్సీలీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌’లను వాడుతున్నామని సంజీవ్​ సింగ్​ చెప్పారు.