రన్నింగ్ ట్రైన్లో చైన్ స్నాచింగ్ చేసిన జెప్టో డెలివరీ బాయ్

రన్నింగ్ ట్రైన్లో చైన్ స్నాచింగ్ చేసిన జెప్టో డెలివరీ బాయ్

రన్నింగ్ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ట్రైన్ లో ఓ మహిళ మెడలో చైన్ లాగుతుండగా అదే బోగీలో ఉన్న పోలీసులు  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి 14 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇతని పేరు చిన్నయ్య అని.. ఇతను జెప్టోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నిన్న(జనవరి 10) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరిగినట్లు తెలిపారు. 

ఇతను ఇప్పటివరకు ఐదు చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. గంజాయికి అలవాటై చిన్నయ్య ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. డ్రగ్స్ కి బానిసై నేరాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు.