షాకిచ్చిన జుమోటో : ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో 50శాతం కోత

షాకిచ్చిన జుమోటో : ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో 50శాతం కోత

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా కంపెనీలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత, ఖర్చుల తగ్గింపుపై దృష్టిసారించాయి. కొద్దిసేపటి క్రితమే జుమోటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ ఉద్యోగులకు మెయిల్ పంపారు. ఆ మెయిల్ లో తన సంస్థలో 13శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు 50శాతం జీతాల్లో కోత విధిస్తున్నట్లు చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తో పాటు అవుట్ ప్లేస్ మెంట్ సాయంతో పాటు వచ్చే ఆరు నెలలు లేదా ఉద్యోగం దొరికే వరకు సగం జీతం ఇస్తున్నట్లు గోయల్ ప్రకటించారు.

లాక్ డౌన్ కారణంగా తమ సంస్థ తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పిన గోయల్..పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు మూసేసినట్లు చెప్పారు. అంతేకాదు వచ్చే 6నుంచి 12నెలల్లో 25-40శాతానికి రెస్టారెంట్లు తగ్గిపోతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇతర సంస్థల్లో 100శాతం జీతాల్లో కోత విధిస్తే తాము మాత్రం 50శాతం కోత విధించినట్లు గోయల్ తెలిపారు.   జూన్ నుండి వేతనాల్ని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ జీతాలు ఉన్నవారికి తక్కువ కోతలు, అధిక జీతాలు ఉన్నవారికి అధిక కోతలు (50% వరకు) విధిస్తున్నట్లు ఆయన అన్నారు. ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యే వరకు అంటే ఆరు నెలల పాటు కోతలు కొనసాగుతాయన్నారు.

ఉద్యోగుల తొలగింపు పై గోయల్ మాట్లాడుతూ ఉద్యోగులందరికి పూర్తిస్థాయిలో వర్క్ ఉండదని, అందుకే 13శాతం ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జుమోటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చెప్పారు.