హైదరాబాద్, వెలుగు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరమైన ఘటన అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్నారు. మంగళవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ భరత్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ..‘‘మృతులలకుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా. కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం’’ అందజేస్తామని ప్రకటించారు.
