బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కు రూ.500 కోట్లు.. రాష్ట్ర సర్కారు కు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ప్రపోజల్స్ 

బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కు రూ.500 కోట్లు.. రాష్ట్ర సర్కారు కు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ప్రపోజల్స్ 

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కోసం  రూ.500 కోట్లు కేటాయించాలని  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

మిడ్ డే మీల్స్‌‌‌‌‌‌‌‌కోసం కూడా రూ. 600 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. దీంట్లో ఎగ్ ధరను కూడా యాడ్ చేశారు. అయితే, నిరుడు  రూ.530 కోట్ల దాకా ఖర్చు కాగా.. గుడ్ల ధర పెరగడంతో కొంత ఎస్టిమేషన్స్ పెంచి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పెట్టారు.