పుణెలో ఆగస్టు 22న ‘ఛాత్రోన్ కీ గూంజ్’

పుణెలో ఆగస్టు 22న ‘ఛాత్రోన్ కీ గూంజ్’

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ తదుపరి కార్యక్రమాన్ని ఆగస్టు 22న పుణెలో నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించారు. విద్యార్థులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని బాలికలకు సమానత్వం, భద్రత, అవకాశాలు అవసరమని రాహుల్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కానీ వారికి అభద్రత, వివక్ష ఎదురవుతోందని, హక్కుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఇకపై ఇలాంటి పరిస్థితిని సహించేది లేదన్నారు. గతవారం ప్రయాగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. దేశ యువతే భారత బలమన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ‘దర్ద్‌‌‌‌‌‌‌‌ (బాధ), డేటా, దౌలత్‌‌‌‌‌‌‌‌ (సంపద)’ అంశాలపై మాట్లాడారు.