రేషన్  బియ్యం పట్టివేత

రేషన్  బియ్యం పట్టివేత

తొగుట(రాయపోల్), వెలుగు: రాయపోల్  మండలం రామారం గ్రామంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్​ టీమ్​ శ్రీసాయి మహదేవ రైస్  మిల్లులో తనిఖీలు నిర్వహించి 1,100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ తెలిపారు. బియ్యం స్వాధీనం చేసుకొని తొగుట, మిరుదొడ్డి ఎంఎల్ఎస్  పాయింట్లకు తరలించారు.

ఈ ఘటనపై రాయపోల్  పోలీస్ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదు చేశారు. సంబంధిత మిల్లర్ పై  గతంలోనూ పీడీఎస్  బియ్యం మళ్లింపు కేసులు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తనిఖీల్లో విజిలెన్స్  ఎన్​ఫోర్స్​మెంట్​ టాస్క్ ఫోర్స్  డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరి, డీటీ రాజిరెడ్డి, రాయపోల్  ఎస్సై కుంచం మానస పాల్గొన్నారు.