హైదరాబాద్: నాసా కాంటెస్ట్ లో తమ విద్యార్థులు మరోసారి సత్తా చాటారని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు తెలిపారు. నాసా, నేషనల్ స్పేస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) సంయుక్తగా అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన స్పేస్ సెటిల్ మెంట్ కాంటెస్ట్‌లో తమ విద్యార్థులు 54 అవార్డులు గెలుపొందారని చెప్పారు. ‘‘ఈ కాంటెస్ట్ మే 22 నుంచి ఈ నెల 4 వరకు జరిగింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 225 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 105 మంది ఇండియా నుంచి ఉన్నారు. మన దేశం నుంచి హాజరైన 105 మందిలో 101 మంది మా విద్యార్థులే” అని శనివారం పేర్కొన్నారు.

