భారీగా తగ్గాక మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. అస్సలు లేటు చేయెుద్దు వీకెండ్ షాపర్స్

భారీగా తగ్గాక మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. అస్సలు లేటు చేయెుద్దు వీకెండ్ షాపర్స్

శుక్రవారం రోజున భారీగా తగ్గిన బంగారం ధర శనివారం తిరిగి పుంజుకుంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ రేటు పెరగటంపై కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉన్నారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత భారీగానే గోల్డ్ రేట్లు పడిపోవటం కొంత తెలుగు ప్రజలకు ఊరటను కల్పించింది. ఈ క్రమంలో వారాంతంలో షాపింగ్ చేయాలని అనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లో ప్రస్తుత ధరలను పరిశీలించటం బెటర్.

జూన్ 20న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.22 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 608గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 390గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 20, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.