నీట్ రీ ఎగ్జామినేషన్ పకడ్బందీ ఏర్పాట్లు .. నల్లగొండ జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు

నీట్ రీ ఎగ్జామినేషన్ పకడ్బందీ ఏర్పాట్లు .. నల్లగొండ జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు

నల్గొండ, వెలుగు : ఈనెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్‌‌‌‌ను జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 21న మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో మొత్తం 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత కోసం ప్రతి కేంద్రానికీ ఇద్దరు చొప్పున సీఆర్పీఎఫ్  బలగాలను నియమించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.