హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హకీంపేటలో భూముల వేలంపై హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీ బిడ్ మీటింగ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ మీటింగ్‌కు సుమారు 50 మంది ప్రముఖ బిల్డ ర్లు అటెండ్ అయ్యారు. షేక్‌పేట మండలం హకీంపేటలో 8.24 ఎకరాలకు వచ్చే నెల 2న వేలం నిర్వహించనున్నారు.
ఎకరం రూ.99 కోట్లు కనీస ధరగా అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఎల్‌ఎల్ సంస్థకు చెందిన సందీప్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎంఎస్‌టీసీ సంస్థ మేనేజర్ జమీల్ అక్తర్ ఈ- వేలం ప్రక్రియపై ప్రజంటేషన్ నిర్వహించి, పాల్గొన్న వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
