తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 24 గంటలు, SSD టోకన్ భక్తులకు 10 గంటలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.
ఇక శుక్రవారం ( జూన్ 19) తిరుమల శ్రీవారిని 74 వేల 128 మంది భక్తులు దర్శించుకున్నారు. 36 వేల 53 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 58 లక్షలు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.
మరొవైపు వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. SSD టోకన్ల జారీ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అర్ధరాత్రి 12 గంటలకు ఇస్తూ వస్తుండగా శుక్రవారం నుండి మద్యాహ్నం 2 గంటలకు టోకన్లు జారీ చేస్తున్నట్లు టిటిడి తెలిపింది. SSD టోకన్లు తీసుకున్న భక్తులకు మరుసటిరోజు దర్శనం ఉంటుందని టిటిడి తెలిపింది.. -
