- కత్తితో పొడిచి రైల్వే ట్రాక్ పక్కన శవాన్ని పడేసిన వైనం
నిజామాబాద్, వెలుగు: బాబు తనకు పుట్టలేదనే అనుమానంతో రెండు నెలల చిన్నారిని తండ్రి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాయ్‌గావ్‌కు చెందిన యువరాజ్‌కు నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ప్రియాంకతో నిరుడు పెద్దలు పెండ్లి చేశారు. ఆ తరువాత ప్రియాంక కాన్పు కోసం తల్లిగారింటికి రాగా, రెండు నెలల కింద మగ బిడ్డ పుట్టగా ప్రేమ్ అని పేరు పెట్టారు. అయితే బాబు పుట్టినప్పటి నుంచి భార్యను అనుమానిస్తున్న యువరాజ్ ఆమెతో గొడవ పడుతున్నాడు.
ఈ నెల 17న భార్యతో గొడవ పడి బాబును ఎత్తుకెళ్లి, రైల్వే ట్రాక్ వద్ద బాబు వీపులో కత్తి దింపి పక్కనే ఉన్న పొదల్లో పడేసి నాయ్‌గావ్ వెళ్లిపోయాడు. ఆందోళన చెందిన ప్రియాంక వన్ టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. శుక్రవారం నగరానికి వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
