Maa Inti Bangaaram Box Office: సోలో హీరోయిన్‌గా సత్తాచాటిన సమంత.. ‘మా ఇంటి బంగారం’కు భారీ ఓపెనింగ్స్

Maa Inti Bangaaram Box Office: సోలో హీరోయిన్‌గా సత్తాచాటిన సమంత.. ‘మా ఇంటి బంగారం’కు భారీ ఓపెనింగ్స్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ నమోదు చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్ల వివరాలు తెలిపింది. సోలో హీరోయిన్‌గా సమంత కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ నిలిచింది.

గతంలో వచ్చిన ‘యశోద’, ‘ఓ బేబీ’ చిత్రాల రికార్డులను అధిగమించిన ఈ సినిమా, అనుష్క శెట్టి ‘ఘాటి’, రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తొలి రోజు వసూళ్లను కూడా వెనక్కి నెట్టినట్లు సమాచారం. అయితే, సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ, వీకెండ్ సెలవులు ఉండటంతో తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్ అందుకుని సత్తా చాటింది.

నటిగా, నిర్మాతగా సత్తా చాటిన సమంత..

‘మా ఇంటి బంగారం’ సినిమాతో సామ్ తన కెరీర్ సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్ అందుకుని స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ సినిమాకు షోస్ పెరిగేకొద్ధి.. టాక్ పాజిటివ్గా మారుతుండటం, వీకెండ్ సెలవలు తోడవ్వడంతో సినీ లవర్స్, లేడీ ఫ్యాన్స్ థియేటర్లలో క్యూ కడుతున్నారు. రానున్న మరో 3 రోజులు ‘మా ఇంటి బంగారం’ సినిమా కలెక్షన్స్కు కీలకంగా మారనున్నాయి.

మొత్తానికి సమంత నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగానూ సాలిడ్ హిట్ అందుకోనుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ వసూళ్లు  వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇండియాలో రూ.5.35 కోట్ల నెట్..

సాక్‌నిల్క్ అంచనాల ప్రకారం, విడుదలైన మొదటి రోజు ఈ చిత్రం ఇండియాలో రూ.5.35 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. పన్నులతో కలిపి భారతదేశంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ.7 కోట్ల వరకు నమోదు చేసింది. ఓవర్సీస్‌ మార్కెట్లలో ‘మా ఇంటి బంగారం’ దాదాపు రూ.5 కోట్లు సాధించినట్లు ఓవర్సీస్ డిస్ట్రీబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వెల్లడించింది. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.13 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు వెర్షన్‌కు మంచి స్పందన..

‘మా ఇంటి బంగారం’ తెలుగు వెర్షన్ థియేటర్లలో బలమైన వసూళ్లను అందించింది. కేవలం తెలుగు వెర్షన్ ద్వారా రూ.5.15 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 2,040 షోలలో ప్రదర్శించబడిన ఈ వెర్షన్‌కు సగటున 37 శాతంక్యుపెన్సీ నమోదైంది. మరోవైపు, తమిళ డబ్బింగ్ వెర్షన్ 618 షోలలో ప్రదర్శించబడగా, దానికి సుమారు 15 శాతం ఆక్యుపెన్సీతో రూ.20 లక్షల నెట్ వసూళ్లు వచ్చాయని వెల్లడించాయి.