హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు బదిలీలు చేయడంతో పాటు పోస్టింగ్‌లు ఇస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌ఎంసీకి కేటాయించిన అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. రాజేందర్ రెడ్డిని చార్మినార్ జోన్ జాయింట్ కమిషనర్‌గా, శ్రీహరిని గోల్కొండ జోన్ జాయింట్ కమిషనర్‌గా, రాజును శంషాబాద్ జోన్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు.
వెంకటయ్యను ఖైరతాబాద్ జోన్ జాయింట్ కమిషనర్‌గా, ఎన్ వెంకటేశ్వర్లును సికింద్రాబాద్ జోన్ జాయింట్ కమిషనర్‌గా, సయ్యద్ ముసాబ్‌ను రాజేంద్రనగర్ జోన్ జాయింట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఉమా మహేశ్వర్ రావును గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎలెక్షన్స్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ) గా , సమ్రీన్ నాజ్‌కు హెడ్ ఆఫీస్‌లో ఏఎంసీ (శానిటేషన్) బాధ్యతలు అప్పగించారు.
శ్రేయను ఏఎంసీ (అడ్మిన్)గా నియమించారు. వి స్వర్ణలత కు గోల్కొండ జోన్ ఏఎంసీ, రజినికి చార్మినార్ జోన్ ఏఎంసీ పోస్టింగ్ ఇచ్చారు. వసంతను రాజేంద్రనగర్ జోన్ ఏఎంసీగా నియమించారు.
