- బీఆర్ఎస్ ఎమ్మెల్యే: వివేకానంద
- హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: దాసోజు
హైదరాబాద్, వెలుగు: అబద్ధాల పునాదులపై రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం అయ్యేందుకు అనేక పార్టీలు మారారని, పాలనా అనుభ వం లేదని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ రూ.12 వేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీతో భూములను తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి, సిద్దిపేటలో హరీశ్‌రావుపై పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో బెదిరించి ప్రైవేటు భూములు లాక్కుంటున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. హిల్ట్‌పాలసీపై త్వరలోనే చార్జి షీట్ రిలీజ్ చేస్తామన్నారు. హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
