6 నుంచి ఇంటర్‌ ఫస్ట్​ ఇయర్​ వాల్యుయేషన్

6 నుంచి ఇంటర్‌ ఫస్ట్​ ఇయర్​ వాల్యుయేషన్

హైదరాబాద్, వెలుగు: అక్టోబర్​25 నుంచి ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్​ఇయర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మొత్తం 4,59, 228 మంది స్టూడెంట్స్ హాజరు కావాల్సి ఉండగా, 94% మంది ఎగ్జామ్స్​కు హాజరయ్యారు. సెకండ్ లాంగ్వేజ్​ ఎగ్జామ్​తో మొదలైన పరీక్షలు, మోడర్న్ లాంగ్వేజీ పేపర్–1, జియోగ్రఫీ–1 ఎగ్జామ్స్​తో ముగిశాయి. కాగా1,768 సెంటర్లలో ఏ రోజూ కూడా ఒక్క మాల్​ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదు. ఇది ఇంటర్ బోర్డు చరిత్రలో రికార్డు అని అధికారులు చెప్తున్నారు. ఈనెల 6 నుంచి ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మొదలుకానుంది. 6 నుంచి ఫస్ట్ స్పెల్, 8 నుంచి సెకండ్ స్పెల్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో మొత్తం 13 స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, కొత్తగా సిద్దిపేటలో కూడా సెంటర్ పెట్టారు. మెదక్ జిల్లాకు చెందిన క్యాంపును కూడా హైదరాబాద్​సిటీ నుంచి రామచంద్రాపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి మార్చారు. మంచిర్యాలలో ఈ ఏడాది కొత్తగా అడిషనల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్​కోసం క్యాంప్ ఆఫీసర్లు, చీఫ్ కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, ఎగ్జామినర్లు, స్ర్కూటినైజర్స్, చీఫ్ ఎగ్జామినర్లను నియమించారు. నవంబర్ నెలాఖరులోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ ఫస్ట్ వీక్​లో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది.