గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ.. 8 మంది మృతి

గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ.. 8 మంది మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టడంతో బస్సుల ముందు భాగాలు దుగ్గుదుగ్గయ్యాయి. 2026 జూన్ 02 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

సూరత్ లోని బర్దోలీ పట్టణానికి సమీపంలో ఉవ మనేక్ పూర్ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. గాయాలపాలైన 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మహారాష్ట్ర బస్సు ధూలె నుంచి నవాపూర్ మీదుగా సూరత్ వెళ్తున్న బస్సు మొదట ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్ దాటి రోడ్డుకు అవతలి వైపున వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఒక బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా.. మరో దాంట్లో 33 మంది ప్రయానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

►ALSO READ | శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. పేషెంట్స్ను మరో ఆసుపత్రికి తరలింపు

ప్రమాదం జరిగిన తర్వాత బస్సు పల్టీలు కొట్టడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం తర్వాత బస్సు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దొర్లుకుంటూ వెళ్లినట్లు చెబుతున్నారు. 

ప్రమాద సమయంలో చాలా మంది ప్యాసెంజర్లు బస్సులో మంటల మధ్య చిక్కుకోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉందని చెబుతున్నారు.