తెలంగాణకుఅమిత్‌‌షా..అక్టోబర్‌‌ 3న హైదరాబాద్ కు

తెలంగాణకుఅమిత్‌‌షా..అక్టోబర్‌‌ 3న హైదరాబాద్ కు
  •     4న  మెదక్‌‌, కరీంనగర్ జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా త్వరలో రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్‌‌ 3, 4 తేదీల్లో సాగే ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌‌ ఖరారైంది. అక్టోబర్‌‌ 3న రాత్రికి హైదరాబాద్‌‌కు చేరుకుని హోటల్‌‌ కాకతీయలో బస చేయనున్న ఆయన.. అక్టోబర్‌‌ 4న ఉదయం మెదక్ జిల్లాకు బయలుదేరతారు. తూప్రాన్ పరిధిలోని ఉర్జా ఇండస్ట్రియల్ పార్కులో ‘సబర్‌‌ డెయిరీ ప్రాజెక్ట్ మిల్క్ ప్లాంట్’ శంకుస్థాపనలో పాల్గొని, డెయిరీ రంగానికి సంబంధించి కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 

మెదక్ టూర్ ముగిసిన వెంటనే ఆయన హెలికాప్టర్‌‌ ద్వారా కరీంనగర్‌‌కు చేరుకుంటారు. అక్కడ నాగనూర్ రోడ్డులోని ప్రతిమ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల అనంతరం సాయంత్రం కరీంనగర్ నుంచి బేగంపేట ఎయిర్‌‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగుప్రయాణం కానున్నారు.