హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ(మల్కాజిగిరి మున్సిపల్‌కార్పొరేషన్) పరిధిలో మంగళవారం అక్రమ నిర్మాణాలపై యాక్షన్తీసుకున్నారు. మల్కాజిగిరి జోన్ బోయిన్‌పల్లి ఫతేనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మూడో అంతస్తును కూలగొట్టగా, సైనిక్‌పురి ఎక్స్‌రోడ్ నుంచి నిర్మల్‌నగర్ ఎక్స్‌రోడ్ వరకు 51 ఆక్రమణలను తొలగించారు. ఉప్పల్ జోన్ యామ్నంపేట్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లోని రాంపల్లి–చెర్లపల్లి రోడ్డులో షెడ్డు, రాంపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద అక్రమ కాంపౌండ్ వాల్ తొలగించారు. కాప్రా, ఉప్పల్ పరిధిలో మరో 31 నిర్మాణాలు, అక్రమంగా నిర్మిస్తున్న 15 షెడ్లు, గుడిసెలను తొలగించారు. చెంగిచెర్ల కాకతీయనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మూడో అంతస్తును తొలగించారు.
కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్ ప్రాంతాల్లో అనధికారంగా నిర్మిస్తున్న మూడో అంతస్తు పిల్లర్లను తొలగించారు. ఎల్‌బీనగర్ జోన్ సరూర్‌నగర్‌లో భాష్యం స్కూల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ డిపో వెనుక రోడ్డు వరకు చేపట్టిన డ్రైవ్‌లో 20 ప్రొజెక్షన్లు, 10 తాత్కాలిక షెడ్లు, ఐదు స్టాల్స్‌ను తొలగించారు. హయత్‌నగర్‌లో భాగ్యలత కమాన్ నుంచి సెయింట్‌జోసెఫ్ స్కూల్ వరకు నిర్వహించిన డ్రైవ్‌లో12 ర్యాంపులు, 22 షెడ్లు కలిపి 34 ఆక్రమణలను తొలగించారు. తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
సీఎంసీలో 15 అక్రమ నిర్మాణాల కూల్చివేత
సీఎంసీ(సైబరాబాద్మున్సిపల్కార్పొరేషన్) పరిధిలో 15 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయగా, మరో 2 బిల్డింగులకు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిర్మిస్తే చర్యలు కొనసాగిస్తామని సీఎంసీ అధికారులు తెలిపారు.
