- 9 నుంచి 11 ఏండ్లలోపు గిరిజన విద్యార్థులు అర్హులు
- ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోటాజీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026–27 విద్యా సంవత్సరానికి గిరిజన బాలబాలికల ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనుల సంక్షేమ శాఖాధికారి ఆర్. కోటాజీ తెలిపారు. కాయాకింగ్, కెనోయింగ్, రోయింగ్, ఫెన్సింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఈ అకాడమీ ప్రారంభించినట్లు తెలిపారు.
5వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో 10 మంది బాలికలు, 10 మంది బాలురకు ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న 9 నుంచి 11 సంవత్సరాల బాల బాలికలు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలతో మార్చి 12 లోగా హైదరాబాద్ కలెక్టరేట్ లోని జిల్లా గిరిజనాభిభివృద్ధి ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం 95730 – 24579 నంబరులో సంప్రదించాలన్నారు.
