బిర్యానీలో బొద్దింకలా.. ఇలాంటివి కామన్.. అరేబియన్ మండీ నిర్వాహకుల సమాధానం

బిర్యానీలో బొద్దింకలా.. ఇలాంటివి కామన్.. అరేబియన్ మండీ నిర్వాహకుల సమాధానం

ముషీరాబాద్, వెలుగు : ఓ అరేబియన్​ మండీ రెస్టారెంట్​కు వెళ్లి బిర్యానీ ఆర్డర్​ ఇవ్వగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. ఈస్ట్ మారేడ్​పల్లి అడ్డగుట్టకు చెందిన సంతోష్, రాఘవ, ప్రశాంత్ మంగళవారం (సెప్టెంబర్ 09) రాత్రి ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తాలో అల్ సౌద్ బైత్ ఆల్ మండీకి వెళ్లారు. 

బిర్యానీ తెప్పించుకుని తింటుండగా అందులో బొద్దింక కనిపించింది.   హోటల్ నిర్వాహకులకు ప్రశ్నించగా ఇలాంటి వి కామన్​ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపించారు. 

కూకట్​పల్లిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విజయ్​నగర్​కాలనీకి చెందిన భాను వివేకానందనగర్​ కాలనీలోని ఓ టిఫిన్​ సెంటర్​ నుంచి  స్విగ్గీ లో ఇడ్లీ తెప్పించుకున్నాడు. దాంతో పాటు వచ్చిన సాంబార్​లో బొద్దింక కనిపించడంతో షాకయ్యాడు.