బుమ్రా కంటే  సిరాజే బెటర్‌‌‌‌

బుమ్రా కంటే  సిరాజే బెటర్‌‌‌‌


న్యూఢిల్లీ: బౌలింగ్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌, వేరియేషన్స్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటే జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా కంటే మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ బెటర్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అని ఇండియా మాజీ పేసర్‌‌‌‌ ఆశిష్‌‌‌‌ నెహ్రా అన్నాడు. రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌తో గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో బెంగళూరు పేసర్‌‌‌‌ మహ్మద్​ సిరాజ్‌‌‌‌(3/27) అద్భుతమైన పెర్ఫామెన్స్‌‌‌‌ చేశాడు. ఈ మ్యాచ్‌‌‌‌ అనంతరం హైదరాబాదీ సిరాజ్‌‌‌‌పై నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ‘ఇండియా–ఎ తరపున ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ కచ్చితంగా ఐదారు వికెట్లు తీస్తున్నాడని కొన్నేళ్ల క్రితం ఎక్కువగా వినిపించేది. కానీ అదే సిరాజ్‌‌‌‌ ఇప్పుడు అన్ని ఫార్మాట్స్‌‌‌‌కు ఉపయోగపడే మంచి బౌలర్‌‌‌‌ అయ్యాడు. స్కిల్‌‌‌‌, వేరియేషన్స్‌‌‌‌ విషయంలో సిరాజ్‌‌‌‌కు తిరుగులేదు. వేరియేషన్స్‌‌‌‌లో బుమ్రా కంటే సిరాజ్‌‌‌‌ ఒక అడుగు ముందుంటాడు. హైదరాబాదీ వద్ద స్పెషల్‌‌‌‌ స్లో బాల్‌‌‌‌ ఉంది. స్పీడ్‌‌‌‌లో తేడా రానియ్యడు. కొత్త బాల్‌‌‌‌ను కూడా స్వింగ్‌‌‌‌ చేయగలడు.. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తోపాటు మైండ్‌‌‌‌సెట్‌‌‌‌ను కాపాడుకుంటే సిరాజ్‌‌‌‌ ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు’ అని నెహ్రా పేర్కొన్నాడు.