V6 News

పశువులను కొనేప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి

పశువులను కొనేప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి
  • అనుమతి లేకుండా ఆవులను  తరలించొద్దు 
  • జూబ్లీహిల్స్​ డీసీపీ రమణారెడ్డి

జూబ్లీహిల్స్, వెలుగు: బక్రీద్​సందర్భంగా పశువులను కొనే టైంలో వెటర్నరీ డాక్టర్ల సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, పర్మిషన్​లేకుండా పశువులను తరలించవద్దని జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణారెడ్డి సూచించారు. మధురానగర్​లోని సాగి రామకృష్ణ కమ్యూనిటీ హాల్​లో బుధవారం బక్రీద్ కో ఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. చిన్న వయస్సున్న దూడలు, అనారోగ్యంతో ఉన్న పశువులను వధకు తీసుకెళ్లకూడదన్నారు.

రోడ్లపై పశువుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉండి పశువులను తరలించేప్పుడు ఎవరైనా అడ్డుకుంటే 100కు డయల్ చేయాలన్నారు. వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, కవర్లలో సేకరించి జీహెచ్ఎంసి శానిటేషన్ వాహనాల్లో వేయాలని సూచించారు.  అడిషనల్​డీసీపీ శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ఆఫీసర్​సురేష్ పాల్గొన్నారు.