ఆగిన భద్రాద్రి ఆలయ ఈవో బదిలీ

ఆగిన భద్రాద్రి ఆలయ ఈవో బదిలీ
  •      కొత్త జీవో జారీ చేసిన సర్కార్​

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థాన ఈవో ఎల్​.రమాదేవి బదిలీ నిలిచిపోయింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్​మిట్టల్​ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన ఈవో రమాదేవిని మేడ్చల్​జిల్లా కీసర ఆర్డీవోగా బదిలీ చేస్తూ జీవో నెంబరు 79 రిలీజయ్యింది. సరిగ్గా ఏడాది క్రితమే ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి ఆలయ ఆదాయం పెంచడంలో సక్సెస్​ అయ్యారు. బదిలీ వార్త విన్న వెంటనే భద్రాచలంలోని ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీల లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలోని అర్చకులు, ఉద్యోగులు, టీఎన్​జీవోలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి లెటర్లు రాశారు. ఈవో రమాదేవిని ఇక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పునరాలోచనలో పడిన సర్కారు తాజాగా జీవో నెంబరు 88 రిలీజ్​ చేసింది. ఈవో రమాదేవి బదిలీ రద్దు చేస్తూ భద్రాచలంలోనే కొనసాగేలా ఆర్డర్స్ ఇచ్చింది.