దసరాకు నువ్వంటే.. అంత ఇష్టం

 దసరాకు నువ్వంటే.. అంత ఇష్టం

పులితో గొడవపడితే ఎలా ఉంటుందో టీజర్‌‌‌‌‌‌‌‌లో చూపించిన ‘భీమ్లానాయక్’ టీమ్, ఖాకీ డ్రెస్సు పక్కనెడితే అతనెంత పెద్ద గూండానో టైటిల్ సాంగ్‌‌‌‌లో చూపించారు. ఈ రెండింటికీ పూర్తి డిఫరెంట్‌‌‌‌గా తనలోని రొమాంటిక్ యాంగిల్‌‌‌‌ని కూడా త్వరలో చూపించబోతున్నారు. ఈ మూవీలోని రెండో పాటలో. ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ పాటను దసరా సందర్భంగా ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. పవన్, నిత్యామీనన్‌‌‌‌ల జంటకి ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో ఈ పాటలో రాశారు రామజోగయ్యశాస్త్రి. తమ హృదయం నుండి వచ్చిన ఈ పాట కొన్నేళ్ల పాటు అందరి చెవుల్లోనూ మారుమోగుతుందని చెబుతున్నాడు తమన్. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.