కార్తికేయ 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్

కార్తికేయ 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్

చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కార్తికేయ 2 ఆగస్ట్ 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న  ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై ఫొకస్ పెట్టిన సినిమా యూనిట్.. సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.

లేటెస్ట్ గా సినిమాలోని #KrishnaIsTruth అనే హ్యాష్ ట్యాగ్‌ను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విడుదల చేశారు. సినిమాలో ఈయన కూడా అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి తత్వం గురించే ఈ సినిమా కథ అంతా సాగుతుందని ఇదివరకే చెప్పారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై టీ.జీ. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్, స్వాతిరెడ్డి జంటగా నటించిన కార్తికేయ సినిమా 2014లో రిలీజ్ కాగా.. మంచి మార్కులే కొట్టింది. 

నటీనటులు: 
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష, వెంక‌ట్‌ తదితరులు

టెక్నికల్ టీం: 

క‌థ‌ -స్క్రీన్‌ప్లే -ద‌ర్శక‌త్యం - చందు మెుండేటి
బ్యాన‌ర్:  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టీ.జీ విశ్వ ప్రసాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్