Peddi Special Song: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు పూనకాలే.. లిరిక్స్ రివీల్ చేసిన బుచ్చిబాబు

Peddi Special Song: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు పూనకాలే.. లిరిక్స్ రివీల్ చేసిన బుచ్చిబాబు

‘పెద్ది’ ట్రైలర్ కుమ్మేస్తుంది. ఊహించినదానికంటే ఎక్కువ రేట్లు ట్రైలర్ ఉండటంతో అందరూ ఫుల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ది నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్పై మెగా ఫ్యాన్స్ లుక్కేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన ప్రమోషనల్ షెడ్యూల్ ప్రకారం, పెద్ది స్పెషల్ సాంగ్‌ను మే 23న విడుదల చేయనున్నారు. ఈ క్రేజీ ఈవెంట్ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించనునున్నారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ A. R. రెహమాన్ స్పెషల్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఊరమాస్ మసాలా సాంగ్‌లో చరణ్‌తో స్టెప్పులేసిన శ్రుతి హాసన్ కూడా ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు మాట్లాడుతూ.."ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లలో ఒక బ్లాస్ట్‌లా ఉంటుంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌, ఆయన డ్యాన్స్ స్టైల్‌కు తగ్గట్టుగా ఈ పాటను భారీ స్థాయిలో రూపొందించాం. అలాగే ఏఆర్ రెహమాన్ తన స్టైల్‌కు భిన్నంగా పూర్తి మాస్ బీట్స్ అందించారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత ఎనర్జిటిక్ సాంగ్స్‌లో ఒకటిగా నిలుస్తుంది" అని బుచ్చిబాబు వెల్లడించారు.

ఇదే క్రమంలో సాంగ్ లిరిక్స్ సైతం పంచుకుని అంచనాలు పెంచారు. విజయనగరం రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగే లోకల్ గేమ్స్, పాలిటిక్స్ విశేషాలతో పెద్ది ముడిపడి ఉంటుందని బుచ్చి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విజయనగర ప్రాంతంలో కుస్తీలో ఉన్న సంఘపెద్దలు ఇచ్చే పార్టీ బేస్ చేసుకుని ఈ పాట వస్తోందని  తెలిపారు. ప్రస్తుత జెనరేషన్లో స్ట్రెస్తో ఉన్నవాళ్ళకి.. ఆ స్ట్రెస్ సైతం నాటీగా ఉంటుందని చెప్పేలా సాంగ్ ఉండబోతుందని బుచ్చి హింట్ ఇచ్చారు.

అడపదడపా, ఇడిసే గడపా..

ఈ క్రమంలోనే అనంత శ్రీరామ్ రాసిన కొన్ని లైన్స్‌ను బుచ్చిబాబు పంచుకున్నారు. ‘‘సొమ్ములు ఉంటాయి.. సోకులు ఉంటాయి.. సంసారాలు ఉంటాయి.. బాధలు ఉంటాయి... బాకీలు ఉంటాయి.. భారాలుంటాయి.. మనిషిన్నవాడికి ఇది మాములే.. ప్రతిపూట తప్పని పేచీలే.. అడపదడపా, ఇడిసే గడపా, ఏమిటంటా తీపిలే...’’ అంటూ పాటపై బుచ్చి హై ఇచ్చాడు.

►ALSO READ | Twisha Sharma: సూసైడ్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నా.. ట్విషా మృతిపై దీక్షిత్ శెట్టి షాకింగ్ రియాక్షన్

ఒక్క లైన్లో వచ్చే పదాల్లోనే ఇంతటి అర్ధం ఉంటే, ఇక పూర్తి సాంగ్ ఎలా అలరిస్తుందో అర్ధమవుతుంది.  బుచ్చిబాబు  వ్యాఖ్యలతో పెద్ది స్పెషల్ సాంగ్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే ఈ సాంగ్‌ను టాలీవుడ్ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఎవడు' సినిమా తర్వాత చరణ్, శృతి మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.

శృతి హాసన్ భారీ రెమ్యునరేషన్!

ఈ ఒక్క పాట కోసం శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయింది. కేవలం ఐదు రోజుల షూటింగ్ కోసం ఆమె దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, ఒక ఐటమ్ సాంగ్ కోసం ఇంత భారీ మొత్తం అందుకోవడం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుగా మారుతుంది. ఎవడు' సినిమా తర్వాత చరణ్, శృతి మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో జోష్ ఎవడు' సినిమా తర్వాత చరణ్, శృతి మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.

రూ.200 కోట్ల బ‌డ్జెట్‌!

దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman)సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. జూన్ 4న ‘పెద్ది’ రాకతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.