- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, విజ్జూకృష్ణన్
కొణిజర్ల, వెలుగు : ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దాసోహం కావడం వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత ఏర్పడిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, విజ్జూ కృష్ణన్ విమర్శించారు. సీపీఎం సీనియర్ నాయకుడు సంక్రాంతి మధుసూదన్‌రావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని సోమవారం ఎంపీ మల్లు రవి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు, విజ్జూకృష్ణన్ మాట్లాడుతూ.. మోదీ సర్కార్ విధానాలు సరిగా లేవన్నారు.
మధుసూదన్‌రావు బాటలో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భూక్యా వీరభధ్రం, బొంతు రాంబాబు, మల్లెంపాటి వీరభద్రం, సంక్రాంతి రవి, పురుషోత్తం, పి.సోమయ్య, చింతనిప్పు సులోచన, చలపతిరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, దారెల్లి కోటయ్య, మచ్చా లక్ష్మీ, జట్ల రంగారావు పాల్గొన్నారు.

