
హైదరాబాద్ సిటీ, వెలుగు: కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఫోన్లలో రీల్స్, క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ.. ఫోన్ మాట్లాడుతూ.. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బండ్లు నడుపుతున్నారు. ఇలా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుండగా, మరికొందరు గాయపడి మంచానికి పరిమితమవుతున్నారు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు చెక్ పెట్టడానికి సిటీ కమిషనర్ సజ్జనార్ చర్యలు చేపట్టారు.
ఫోన్ మాట్లాడుతూ, రీల్స్చూస్తూ, పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నోళ్లు ఆ పద్ధతి మార్చుకోవాలని 15 రోజుల కిందనే సీపీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో హెచ్చరించారు. ఈ క్రమంలో సీపీ ఆదేశాల మేర కు నగర పోలీసులు సెల్ఫోన్వాడుతూ డ్రైవింగ్
చేస్తున్నోళ్లను పట్టుకునేందుకు వారం కింద స్పెషల్‌డ్రైవ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ వారం రోజుల్లోనే సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవ్
చేస్తున్న 3,600మందిపై కేసులు నమోదు చేశారు.
అటు రైడ్.. ఇటు ఫోన్
స్పెషల్‌డ్రైవ్‌లో పోలీసులను ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడయ్యాయి. ఎక్కువగా ఆటో డ్రైవర్లు చెవిలో ఇయర్ఫోన్స్పెట్టుకుని రైడ్కొనసాగుతున్నంత సెల్‌ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటూనో, రీల్స్, సినిమాలు చూస్తూనో డ్రైవ్ చేస్తున్నట్టు
గుర్తించారు. వీరిని ప్రయాణికులు గట్టిగా ప్రశ్నిస్తేనే బంద్‌చేసి నడుపుతున్నారని, లేకపోతే గంటల తరబడి సెల్‌ఫోన్ వాడుతూనే డ్రైవ్చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే టూవీలర్లు, కార్లు, ఇతర వాహనాలు నడిపే వారు కూడా ఇలాగే చేస్తున్నట్టు తెలుసుకున్నారు.
రూల్స్ మారినయ్...
సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించి నిబంధనలు మారాయని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గతంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫైన్ విధించే అవకాశం ఉండేదని.. కానీ, ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లో పట్టుబడితే కేసు పెట్టి కోర్టుకు పంపిస్తున్నామని తెలిపారు. కోర్టు ఇచ్చే ఆదేశాలు, డైరెక్షన్స్ బట్టి నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవింగ్చేయడమనేది మల్టీ టాస్కింగ్కిందకు వస్తుందని, ఈ సమయంలో మైండ్కన్ఫ్యూజ్అయి కాన్సంట్రేషన్ తగ్గి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అందుకే, సీపీ సజ్జనార్ఆదేశాల మేరకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టినట్టు పేర్కొన్నారు.