రాష్ట్రంలో ఇవాల, రేపు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో ఇవాల, రేపు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలోని పలు చోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కుమ్రంభీం జిల్లా కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో 7.9 సెంటీమీటర్లు, మెదక్‌‌‌‌‌‌‌‌లోని ఇస్లాంపూర్‌‌‌‌‌‌‌‌ 6.2, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని జకోరా 4.6, కామారెడ్డిలోని నస్రూల్లాబాద్‌‌‌‌‌‌‌‌లో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.