భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెక్ డ్యాం

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెక్ డ్యాం

కరీంనగర్: వాగులు, వంకల్లో వరద ప్రవాహం ఎంత వచ్చినా.. తన ఎత్తువరకు నీళ్లను నిలిపిపెట్టేందుకు నిర్మించే చెక్ డ్యాంలు భారీ వర్షాలకే కొట్టుకుపోతున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ వాగులో నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. రూ.5.96 కోట్ల నిధులతో ఇటీవలే నిర్మించిన చెక్ డ్యాం ఒకే వర్షానికి కొట్టుకపోయింది. గత జూలైలో కురిసిన వర్షాలకు చెక్ డాం కరకట్టలు కొట్టుకుపోగా ఇపుడు ఏకంగా చెక్ డ్యాం ధ్వంసం అయింది.