
అంబర్ పేటలో నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రూ. 539.23 కోట్లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ప్రారంభించారు . 332 MLD ల సామర్థ్యం గల 6 ఎస్టీపీ లను జలమండలి నిర్మించింది. అలాగే అమృత్ 2.0 పథకం కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. 972 MLD ల సామర్థ్యం గల ఈ STP లకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది.
సీఎం ప్రారంభించిన ఎస్టీపీల వివరాలు
1. రూ. 319.43 కోట్లతో నిర్మించిన అంబర్ పేట్& ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని 212.50 MLD సామర్థ్యం గల అంబర్ పేట్ ఎస్టీపీ
2. రూ. 109.24 కోట్లతో నిర్మించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని 64 MLD సామర్థ్యం గల అత్తాపూర్ ఎస్టీపీ
3.రూ. 44.46 కోట్లతో నిర్మించిన కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని 25 MLD సామర్థ్యం గల ముల్లకతువా ఎస్టీపీ
4. రూ. 34.13 కోట్లతో నిర్మించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 14 MLD సామర్థ్యం గల శివాలయ నగర్ ఎస్టీపీ
5. రూ. 13 కోట్లతో నిర్మించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 10 MLD సామర్థ్యం గల వెన్నలగడ్డ ఎస్టీపీ
6.రూ. 18.97 కోట్లతో నిర్మించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 7 MLD సామర్థ్యం గల పాలపిట్ట ఎస్టీపీ
నగరంలో 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 STP లకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్తగా 39 ఎస్టీపీలకు శంకుస్థాపన
1. రూ. 1878.55 కోట్లతో ప్యాకేజీ-1 లో 16 ఎస్టీపీలు
2. రూ. 1906.44 కోట్లతో ప్యాకేజీ-2 లో 22 ఎస్టీపీలు
3. రూ. 64.11 కోట్లతో PPP మోడల్ లో ఒక ఎస్టీపీ