- హాలియా, నందికొండ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
హాలియా, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా హాలియా నందికొండ మున్సిపాలిటీల పీఠాలను కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అదే విధంగా నందికొండ మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల చంద్రారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ముహాలియా మున్సిపల్ ఏడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల చంద్రారెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టిపోలు శ్రీనివాస్ పై 651 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. హాలియా, నందికొండ రెండు మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చంద్రారెడ్డికి టాప్ మెజార్టీ ని సాధించారు.
