12 గంటల నుంచే అనుమతి.. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు

12 గంటల నుంచే అనుమతి.. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం 2500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు. మ్యాచ్ కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులను స్టేడియంలోపలికి అనుమతిస్తామన్నారు. గ్రౌండ్ లోపలికి ఎవరూ రావొద్దని..వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్లాక్లో టికెట్లు విక్రయించినా.. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని..షీ టీమ్స్  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.  


భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ నేపథ్యంలో  ప్రతీ గేట్ దగ్గర సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తామని డిసిపి రక్షిత వెల్లడించారు. గేట్ నెంబర్ 1,2 దగ్గర మార్పులు చేశామని...ఈ రెండు గేట్ల నుంచి ప్లేయర్లు, సీఎం, గవర్నర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రిజర్వ్ బందోబస్తు అందుబాటులో ఉందన్నారు. ఏదైనా ఇబ్బంది అయితే  రిజర్వ్ ఫోర్స్ ను వాడతామని చెప్పారు. అటు బ్లాక్ టికెటింగ్ పై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసినట్లు డిసిపి రక్షిత తెలిపారు.