V6 News

మహిళా బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి విజయం

మహిళా బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి విజయం

ముషీరాబాద్, వెలుగు:  పార్లమెంట్​లో మహిళా, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి నైతిక విజయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించకుండా కేంద్రం హడావుడిగా తెచ్చిన ఈ బిల్లు విఫలమవ్వడం సామాజిక న్యాయ సాధనలో శుభపరిణామమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు కూడా ఎస్సీ, ఎస్టీల తరహాలోనే 27 శాతం కోటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన గళం వినిపించి బిల్లులను అడ్డుకున్న విపక్షాలకు ఆయన అభినందనలు తెలిపారు.