ఢిల్లీలో క్షణక్షణం టెన్షన్ టెన్షన్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. జంతర్ మంతర్ లో నిరసనకు వస్తున్న ఆందోళన కారులను, కాక్రోచ్ పార్టీ మద్ధతు దారులను ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు పోలీసులు. ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మెలతో కాక్రోచ్ లను అడ్డుకుంటున్నారు. అడుగడుగునా పోలీసులతో ఢిల్లీ పోలీసుల వయంగా మారిపోయింది.
కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ.. 2026 అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ 2.O లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి కాక్రోచ్ లు, జెన్ జీలతో పాటు సీజేపీ మద్ధతు దారులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో అడుగడుగునా పోలీసు బలగాలతో యుద్ధవాతావరణం తలపిస్తోంది.
కేరళ హౌస్ దగ్గర భారీగా పోలీసులు:
జంతర్ మంతర్ కు దగ్గర్లో ఉన్న కేరళ హౌస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిరసన కారులను అడ్డుకునేందుకు కాస్త గ్యాప్ లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం మీడియాకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కేరళ హౌస్ మీదుగా నిరసన కారులు జంతర్ మంతర్ చేరుకోకుండా అడ్డుకుంటున్నారు.
ఘజియాబాద్ బార్డర్ లో సిమెంటు దిమ్మెలతో రోడ్లు బ్లాక్:
ఉత్తరప్రదేవ్ నుంచి డిల్లీ వచ్చే ఘజియాబాద్ బార్డర్ దగ్గర పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించారు. సిమెంటు దిమ్మెలతో వాహనాలు వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా బారికేడ్లతో, ఇనుప కంచెలతో రోడ్లు బ్లాక్ చేశారు.
#WATCH | Uttar Pradesh: Heavy stone barricades being placed at Ghaziabad border (UP-Delhi border) as security measure ahead of the Cockroach Janta Party (CJP) protest today. https://t.co/0zNDrAgDwx
— ANI (@ANI) October 10, 2026
అప్సరా బార్డర్ లో సెక్యూరిటీ టైట్:
అటు అప్సరా బార్డర్ లోనూ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. డ్రోన్స్ తో నిఘా పెంచారు. సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. డీసీపీ షహదరా రాజేంద్ర ప్రసాద్ మీన ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అప్సరా బార్డర్ నుంచి ఢిల్లీలోకి ఎంటరయ్యే మార్గం మొత్తం బారికేడ్లతో నిండిపోయింది. ఎటు చూసినా ముళ్ల కంచెలు దర్శనమిస్తున్నాయి. నిరసనకు వెళ్తున్నట్లు చిన్న అనుమానం వచ్చినా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువతను ఎక్కడికక్కడ డిటైన్ చేస్తున్నారు పోలీసులు.
#WATCH | Delhi: Heavy deployment of security forces at the Apsara Border ahead of the protest called by the CJP. Drones are also being utilized by security personnel to monitor the situation and maintain strict vigilance. DCP Shahdara Rajendra Prasad Meena says, "Regarding the border, we have enforced strict measures. We are regulating the entry of commercial vehicles based on specific timings and allowing them to pass only after thorough checks, ensuring that no unauthorized persons reach the other side. Our traffic staff is also deployed here. We have also deployed additional forces provided to us, and the maximum possible staff from our local police station is on duty. Patrolling is underway in all sensitive areas, and we are maintaining constant communication. We are urging people not to attempt to go there, warning them that legal action could be taken against them if they do... We have spoken with the UP authorities, and they have assured us of their full cooperation. They have set up pickets on their side as well and will allow vehicles to pass only after checking them... We are monitoring the situation with drones. We also have CCTV cameras permanently installed here, and we are conducting videography and photography as well... we have provided body cameras to the majority of our staff."
— ANI (@ANI) October 10, 2026
