కాక్రోచ్ పార్టీ నేతల అరెస్టును తీవ్రంగా ఖండించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఇది ఎమర్జెన్సీకి మించిన దౌర్జన్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 అక్టోబర్ 10న సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంక, సౌరవ్ దాస్ లను ఢిల్లీ ఇందిరగాంధీ ఎయిర్ పోర్టు నుంచి అరెస్టు చేసిన విధానంపై తీవ్రంగా మండిపడ్డారు.
మనం మోదీ డిక్టేటర్ షిప్ కింద బతుకుతున్నాం. ఇది అధికారికంగా డిక్టేటర్ షిప్ లాగానే ఉంది. విమానం దిగకముందే సీజేపీ నేతలను అరెస్టు చేయడం చూస్తుంటే మోదీ ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్థమవుతుంది అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
This is worse than the Emergency. It’s official.. we are living under an absolute dictatorship ruled by Modi. Arresting cockroaches straight off their flight shows an unprecedented level of fear. PM Modi clearly knows he only won the election through vote chori and now he is hell-bent on protecting his fraud by completely crushing democracy. Gyanesh must go, but so must Modi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 10, 2026
వోట్ చోరీ ద్వారా మాత్రమే గెలుచానని ప్రధాని మోదీకి క్లియర్ గా తెలుసు. అందుకే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అణచివేసి.. డెమొక్రసీని నాశనం చేస్తున్న వ్యక్తిని కాపాడేందుకు ఇలా తెగబడుతున్నారు అంటూ పేర్కొన్నరు.
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ దిగిపోవాలి. అంతకంటే ప్రధాని మోదీ దిగిపోవాలి.. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేజ్రీవాల్.
ఓట్ చోరీకి పాల్పడి ఎన్డీఏ గెలుపుకు ప్రయత్నించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలున్న సీఈసీ జ్ఞనేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ 2026 అక్టోబర్ 10 (శనివారం) నిరసనలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శాంతియుత ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్న సీజేపీ లీడర్స్ ను ఎయిర్ పోర్టులోనే.. అదికూడా విమానం నుంచి దిగకముందే అరెస్టు చేసిన తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
