ముఖం ఎంత అందంగా ఉన్నా ముక్కుపై కనిపించే హెడ్స్ తో ఫేస్ డల్ గా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పార్లర్ లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరైన రిజల్ట్ ఉండదు. మళ్లీ రెండు మూడు రోజులకే ముక్కుపై మచ్చలు మళ్లీ వచ్చేస్తాయి. అలా కాకుండా కొన్ని హోమ్ రెమెడీస్ తో ముక్కుపై వచ్చే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా పోగొ ట్టొచ్చు.
ఐస్ క్యూబ్స్
చర్మంపై ఐస్ క్యూబ్స్ తో రబ్ చేస్తే బ్లాక్ హెడ్స్ నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద హోల్స్ పడకుండా ఐస్ క్యూబ్స్ సాయపడతాయి. దీనివల్ల ఆ హోల్స్ నుంచి బ్లాక్, వైట్ హెడ్స్ బయటకు రాలేవు. అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ ఫేస్ పై పెడుతుంటే స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. ముఖ్యంగా తరచూ మేకప్ వేసేవాళ్లు ముందు ఐస్ క్యూబ్ తో ఫేసంతా రబ్ చేసిన తర్వాతే మేకప్ వేస్తే బెటర్. దీని వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.
షుగర్ స్క్రబ్
షుగర్ తో కూడా బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేయొచ్చు. షుగర్ లో కాస్త నీళ్లు వేసి దాన్ని ముక్కు చుట్టూ అప్లై చేయాలి. ఐదు నిమిషాలు స్క్రబ్ చేయాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్ ఈజీగా రాలిపోతాయి.
