జ్ఞానేష్ కుమార్ దిగిపోతారు.. ఈ ప్రభుత్వం కూడా దిగిపోతుంది: రాహుల్ గాంధీ ట్వీట్

జ్ఞానేష్ కుమార్ దిగిపోతారు.. ఈ ప్రభుత్వం కూడా దిగిపోతుంది: రాహుల్ గాంధీ ట్వీట్

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి తీరాల్సిందేనని ప్రతిపక్షాలు, సీజేపీ డిమాండ్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక ట్వీట్ చేశారు. జ్ఞానేష్ కుమార్ దిగిపోతారని, ఈ ప్రభుత్వం కూడా దిగిపోతుందని.. అప్పటి నుంచే ప్రజాస్వామ్యాన్ని పునర్నించుకోవాల్సిన సమయం ఆరంభం అవుతుందని రాహుల్ పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలను ఎలా దొంగిలించారనేదానికి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని దేశమంతా చూసిందని రాహుల్ చెప్పారు. శుక్రవారం ఇండియా కూటమి పార్టీల ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి మెమోరాండం సమర్పించింది.

రాష్ట్రపతితో సమావేశం తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం సోమవారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని కలుస్తాం. ఆయనకూ ఒక మెమొరాండం అందజేస్తాం” అని వెల్లడించారు. కాగా, రాష్ట్రపతితో ప్రతిపక్ష పార్టీల బృందం సమావేశంపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే, ప్రతిపక్ష నేతలు ఇచ్చిన మెమోరాండంలో ప్రధానంగా ఆరు డిమాండ్లను పేర్కొన్నారు.

ALSO READ : ఎమర్జెన్సీని మించిన దౌర్జన్యం ఇది: సీజేపీ లీడర్స్ అరెస్ట్పై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

‘‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ కల్పించే 2023 చట్టం రద్దు చేయాలి. సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన మొత్తం 13.3 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలి. అన్ని ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం ప్రవేశపెట్టాలి. గత రెండేళ్లలో ఓట్ చోరీకి కచ్చితమైన ఆధారాలు సమర్పించిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి”అని కోరారు.