నువ్వేమన్నా శంకర్ దాదా అనుకున్నావా డాక్టర్.. సికింద్రాబాద్లో బంగారం కొంటానని నమ్మించి..

నువ్వేమన్నా శంకర్ దాదా అనుకున్నావా డాక్టర్.. సికింద్రాబాద్లో బంగారం కొంటానని నమ్మించి..

ఈ డాక్టర్ తనకు  తాను శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకున్నట్లుంది. వైద్యం చేసుకుని బతకమంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. 2026 అక్టోబర్ 10 న డాక్టర్ యంశ్వంత్ ను అరెస్టు  చేశారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. న్యూ లైఫ్ ఆసుపత్రి వైద్యుడు యశ్వంత్ కుమార్ ఓవ్యక్తిని నమ్మించి మోసం చేసిన కేసులోమార్కెట్ పోలీసులు  అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి వద్ద బంగారం కొంటానని నమ్మించి ఆస్పత్రికి రప్పించాడు డాక్టర్ యశ్వంత్. ఆస్పత్రికి పిలిపించి నిర్బంధించి దాడికి పాల్పడ్డాడు. తనకే డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు.

డబ్బులు  ఇచ్చేదాక వాహనాలు ఇచ్చేది లేదని.. ఆసుపత్రిలో పెట్టుకొని వారిని పంపించాడు. అయితే తమకు వీలైనంత డబ్బును సర్దుబాటు చేశారు బాధితులు. చివరికి 30 వేల రూపాయలు చెల్లించినా వాహనాలు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నిర్బంధించి దాడికి పాల్పడినందుకు అరెస్ట్ చేసి రిమాండ్ కు  తరలించారు మార్కెట్ పోలీసులు.