చైనాలో డెల్టా డేంజర్

V6 Velugu Posted on Sep 15, 2021

బీజింగ్: కరోనా డెల్టా వేరియంట్​ కేసులు పెరుగుతుండటంతో మరో సిటీలోనూ చైనా లాక్​డౌన్​ పెట్టింది. దాదాపు 45 లక్షల మంది జనాభా ఉన్న క్సియామెన్​ సిటీలో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులను బంద్​ పెట్టింది. ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగే కాంప్లెక్స్​ను క్లోజ్​ చేసింది. డెల్టా వేరియంట్​ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఇతర సిటీలకు వైరస్​ పాకకుండా చర్యలు తీసుకుంది. ఫుజియాన్​ ప్రావిన్స్​లోని క్సియామెన్​ సిటీ ఎలక్ట్రానిక్​ పరికరాల ఉత్పత్తికి కేంద్రం.. ఏబీబీ లిమిటెడ్​ సహా పేరొందిన కంపెనీలకు సెంటర్. ఈ సిటీలో  ఇప్పటి వరకు డెల్టా వేరియంట్ కరోనా కేసులు 59 బయటపడ్డాయని అధికారులు చెప్పారు. వీటితో ఫుజియాన్​ ప్రావిన్స్​లో మొత్తం డెల్టా కేసులు 103 కు చేరాయని వివరించారు. దీంతో ఎమర్జెన్సీ టైమ్​లోనే బయటకు  రావాలని అధికారులు ఆంక్షలు పెట్టారు.

Tagged China, , Delta Danger

Latest Videos

Subscribe Now

More News