హైదరాబాద్ : రచ్చబండ కార్యక్రమానికి వెళ్లే కాంగ్రెస్ నేతల అరెస్ట్ పై మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మండిపడ్డారు. సోమవారం బాగ్ అంబర్ పేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి రాష్ట్రంలో బీజేపీకి ఓ న్యాయం కాంగ్రెస్ కు మరో న్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఏకమై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. యాసంగి పంట విషయంలో కేసీఆర్ కు ఓ న్యాయం రైతులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. యాసంగి పంట పూర్తిగా కొనుగోలు చేసేంతవరకు రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎప్పుడు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగ్గారెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు లేదనే సమాచారం ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.
