వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు పెట్రోల్ లీటరు రూ. 82లకే.. మార్కెట్లోకి సరికొత్త ఇంధనం వచ్చేసింది!

 వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు పెట్రోల్ లీటరు రూ. 82లకే.. మార్కెట్లోకి సరికొత్త ఇంధనం వచ్చేసింది!

భారతదేశ వాహన, ఇంధన రంగాలలో ఇప్పుడు E85 ఇంధనం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఇంధనం ఇప్పుడు అధికారికంగా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేసింది. ఎక్కువ మొత్తంలో ఇథనాల్ ఉండే ఈ ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని పూసా రోడ్ ఇండియన్ ఆయిల్ బంకులో మొదటి E85 కేంద్రాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం ఈ ఇంధన కేంద్రాలను దేశవ్యాప్తంగా పెంచాలని చూస్తోంది. మొదటి దశలో  ఢిల్లీ-NCR, ముంబై-పూణే-నాగ్‌పూర్ రూట్లలో 50 నుండి 100 కేంద్రాలను,  ఈ ఏడాది చివరికి  500కి పైగా ఏర్పాటు చేయనున్నారు.  2027 చివరి నాటికి దేశంలోని ప్రముఖ  నగరాల్లో సుమారు 5వేల  E85 బంకులను తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్  చేస్తుంది.

E85 అంటే ఏమిటి
 ప్రస్తుతం మనం వాడుతున్న E20 పెట్రోల్‌లో 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉంటుంది. కానీ, E85 లో 85% ఇథనాల్, కేవలం 15% పెట్రోల్ మాత్రమే ఉంటుంది. ఇథనాల్‌ను మన దేశంలోనే వ్యవసాయ పంటల నుండి తయారు చేస్తారు. దీనివల్ల వేరే దేశాల నుండి ముడి చమురు దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. అలాగే దేశీయంగా ఇంధన భద్రత పెరుగుతుంది. వినియోగదారులకు కూడా తక్కువ ధరకే ఇంధనం దొరుకుతుంది.

ఈ ఇంధనం ఏ వాహనాలకు పనికొస్తుంది
సాధారణ పెట్రోల్ బండ్లలో E85 ఇంధనాన్ని వాడలేము. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన "ఫ్లెక్స్-ఫ్యూయల్"  వాహనాలు మాత్రమే అవసరం. 

ప్రస్తుతం మన దేశంలో రాబోతున్న కొత్త  వాహనాలు
మారుతి సుజుకి వాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్: ఈ కార్ పూర్తిగా 100% ఇథనాల్‌తో నడవగల భారతదేశపు మొదటి ఫ్యామిలీ కార్,  ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది.  సాధారణ బైకుల సెగ్మెంట్‌లో హీరో కంపెనీ హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ అండ్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ తెచ్చింది. ఇవి E20, E85 ఇంధనం రెండిటితో నడుస్తాయి. ఇవి జూలై 2026 నుండి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మకానికి రానున్నాయి.

సుజుకి గిక్సర్ SF FFV బైక్
భారతదేశం అనుకున్న టైం కంటే ముందే దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు E85 వైపు అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి వస్తే, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి E85 ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.

E85 ఇంధనం ధర 
ఢిల్లీలో లీటరు E85 ధరను రూ. 82.12 గా నిర్ణయించారు. దింతో ఇప్పుడు మార్కెట్లో ఉన్న సాధారణ E20 పెట్రోల్ కంటే రూ. 20  తక్కువకే లభిస్తుంది. వాహనదారులు కంగారు పడకుండా ఉండటానికి, E85 ఇంధనం పోసే మెషిన్లపై ప్రత్యేకమైన గుర్తులు, లేబుళ్లు ఏర్పాటు చేశారు.