
తెలంగాణలో భారీ వర్షాలకు 1700 మందిని కాపాడామని అగ్నిమాపక శాఖ డీజీ నాగి రెడ్డి తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ లో 15 వందల మంది సిబ్బందిని కాపాడామన్నారు. ఖమ్మం , మహబూబాబాద్ , కోదాడ లో చాలా మందిని రక్షించామని చెప్పారు. ఫైర్ సేఫ్టీ , డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యలు చేపట్టిందన్నారు. ఖమ్మంలో 1000 మందిని , మహబూబాబాద్ , సూర్యపేట లో 350 మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసిందన్నారు. ఇంకా ఖమ్మంలో ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు డీజీ. ఖమ్మంలో 800 మందిని బోట్ల సహాయంతో వరద బాధితుల్ని ఫైర్ సేఫ్టీ టీం రక్షించిందని చెప్పారు నాగిరెడ్డి.
మరో వైపు తెలంగాణలో భారీ వరదలకు 16 మంది చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. లక్షలాది ఎకరాల్లోపంట నష్టం వాటిల్లిందని..వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని వెల్లడించారు. తెలంగాణల వరదల బీభత్సాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది..తక్షణ సాయం కింద తెలంగాణకు 2 వేల కోట్లు రిలీజ్ చేయాలని కోరారు.